‘గని’ ఐటెం సాంగ్ మాములుగా లేదు

గద్దల కొండ గణేష్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి-వరుణ్‌తేజ్‌ కాంబోలో వస్తోన్న ఈ చిత్రానికి గని అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను మార్చి 18 న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈరోజు సంక్రాంతి సందర్బంగా చిత్ర యూనిట్ చిత్రంలోని ఐటెం సాంగ్ ను రిలీజ్ చేసి అభిమానులను ఉత్సహం నింపారు.

‘రింగారే రింగా రింగా .. రింగా రింగా’ అంటూ సాగే ఈ పాటకు తమన్‌ సంగీతం అందించాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. హారిక నారాయణ్ ఈ పాటను ఆలపించింది. కాగా ఈ పాటలో తమన్నా తన స్టెప్పులతో అదరిగొట్టింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది.