‘మా’ అప్పుడే నిర్వహిస్తారా..?

తెలుగు చిత్ర సీమలో మూవీ ఆర్టిస్స్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్‌ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ నిబంధనలను తొలగిస్తే కానీ ఎన్నికలను నిర్వహించలేమని ప్రస్తుత కార్యవర్గం పేర్కొంది. అయితే కోవిడ్‌ మూడో వేవ్‌ రాకపోతే – ఎన్నికలను సెప్టెంబర్‌లోనే నిర్వహించే అవకాశముంది. ఈ ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు , జీవిత రాజశేఖర్ , హేమలు పోటీపడుతున్నారు.