Site icon TeluguMirchi.com

మాచర్ల నియోజకవర్గం ‘మాస్ జాతర’ కొత్త ప్లేస్ ఇదే …


నితిన్ హీరోగా క్యాథరీన్ థ్రెసా, కృతి శెట్టి హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ మూవీకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ ఎడిటర్ ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో నితిన్ కలెక్టర్ పాత్ర చేస్తుండగా నటి అంజలి ఇందులో ఒక మాస్ సాంగ్ చేస్తున్నారు. రా రెడ్డి ఐయాం రెడీ అనే పల్లవితో సాగె ఈ సాంగ్ ప్రోమో ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

అయితే ఈ పాటని శ్రీకాకుళంలో ఈనెల 9న మాస్ జాతర ఈవెంట్ రిలీజ్ చేయాలని భావించిన యూనిట్, అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రేక్షకాభిమానులకు రవాణా ఇబ్బందులు కలుగకుండా వెన్యూ ని హైదరాబాద్ (ఏఎంబి సినిమాస్) కి షిఫ్ట్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ ఆగష్టు 12న విడుదల కానుంది.

Exit mobile version