మాస్ట్రో మూవీ టాక్

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈరోజు ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. హీరో నితిన్ ల్యాండ్ మార్క్‌గా న‌టిస్తోన్న 30వ చిత్రమిది. ఈ మూవీ ఫై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకోగా..ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉందని చెపుతున్నారు. నితిన్ డిఫ‌రెంట్‌గా చేసిన సినిమాల్లో ఇదొక‌టి అని అంటున్నారు. నెగిటివ్ రోల్ లో తమన్నా అదరగొట్టిందని చెపుతున్నారు. హీరోయిన్‌గా న‌భాన‌టేశ్ కూడా త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. సీనియ‌ర్ హీరోగా చేసిన వి.కె.న‌రేశ్‌, త‌మ‌న్నా సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్‌గా న‌టించిన జిస్సుసేన్ గుప్తా, న‌రేశ్ కుమార్తెగా న‌టించిన అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సుసేన్ భార్య‌గా న‌టించిన శ్రీముఖి, సెకండాఫ్‌లో కీల‌కమైన పాత్ర‌ల్లో న‌టించిన మంగ్లీ, ర‌చ్చ‌ర‌వి, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఇలా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేసారని అంటున్నారు.

ఇక డైరెక్టర్ మేర్లపాక గాంధీ మాతృక‌ను చెడ‌గొడ్డ‌కుండా తెలుగువారికి క‌నెక్ట్ అయ్యేలా సినిమాను ముందుకు తీసుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యారు. మాతృక‌తో పోల్చితే చిన్న చిత‌క మార్ప‌లు తప్ప మ‌రేం క‌న‌ప‌డ‌దు. ఒరిజిన‌ల్‌లో గ్రిప్ మిస్ కాకుండా, పాట‌ల‌ను మిక్స్ చేసి క‌థ‌ను న‌డిపించ‌డంలో మేర్ల‌పాక గాంధీ స‌క్సెస్ అయ్యారని చెపుతున్నారు. ఓవరాల్ గా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది.