Site icon TeluguMirchi.com

మహేష్ బాబు ను ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు..

సూపర్ స్టార్ మహేష్ బాబు వివాదస్పద వార్తలకు దూరంగా ఉంటాడనే సంగతి తెలిసిందే.. అభిమానులు , నెటిజన్లు ఎప్పుడు కూడా మహేష్ ను పొగడడమే కానీ ఆయన పరువు పోయేలా కామెంట్స్ చేయడం చేసేవారు కాదు..అలాంటిది ఇప్పుడు మహేష్ ను సోషల్ మీడియా లో ఓ ఆట ఆడుకుంటున్నారు. తాజాగా జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల పోలింగ్ లో మహేష్ బాబు తన భార్యతో కలిసి డైరెక్టుగా లోపలికి వెళ్లిపోయాడు. కనీసం లైన్లో నిలవాలన్న ఆలోచనే చేయలేదు. దీనిని అంత తప్పు పడుతున్నారు.

ఇటీవల మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో క్రమశిక్షణ గురించి.. నిబంధనల గురించి ఓ రేంజ్ లో చెప్పాడు. సినిమాల వరకు నీతులు చెప్పిన మహేష్.. నిజ జీవితంలోకి వచ్చేసరికి మాత్రం పోలింగ్ కేంద్రంలో మిగతా ఓటర్లతో కలిసి లైన్లో నిలవకుండా నేరుగా లోపలికి వెళ్లిపోవడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.

2014 ఎన్నికల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి పోలింగ్ కేంద్రానికి ఓటేయడానికి వచ్చారు. ఐతే ఆయన లైన్లో నిలవకుండా డైరెక్టుగా లోపలికి వెళ్లాలని చూస్తే ఒక ఓటరు అడ్డుకుని.. ఇదేం న్యాయమని ప్రశ్నించి ఆశ్చర్యపరిచాడు. మిగతా ఓటర్లు అతడికే మద్దతుగా నిలవడంతో చిరు వెనక్కి తగ్గి లైన్లో నిలబడక తప్పలేదు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆ తప్పు మరోసారి చేయకుండా చిరంజీవి ఈసారి అందరితో పాటు లైన్లో నిల్చొని తన ఓటు వేయడం జరిగింది.

Exit mobile version