Site icon TeluguMirchi.com

‘హీరో’ మూవీ ఫై మహేష్ ప్రశంసలు

సంక్రాంతి బరినుండి ఆర్ఆర్ఆర్ తప్పుకోవడం తో చిన్న చిత్రాలు సంక్రాంతి ని క్యాష్ చేసుకుంటున్నాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటిస్తున్న ‘హీరో ‘ ఒకటి. దేవ‌దాస్ ఫేం శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించగా.. ప‌ద్మావ‌తి గ‌ల్లా చిత్రాన్ని నిర్మించారు. ఇస్మార్ట్ శంక‌ర్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌.. అశోక్ స‌ర‌స‌న నటించింది. జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్యా, అర్చ‌నా సౌంద‌ర్య‌ తదితరులు నటించారు. నిన్న రిలీజ్ అయినా ఈ మూవీ కి పాజిటివ్ టాక్ రావడం తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క పలువురు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా లలో సినిమా ఫై ప్రశంసలు కురిపిస్తుండడం తో ప్రేక్షకుల్లో సినిమా చూడాలనే ఆసక్తి పెరుగుతుంది.

సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్ బాబు మరియు తెలుగు ప్రేక్షకులు సినిమా చూసి బాగుందని చెప్తున్నారు. ‘హీరో’ కి పాజిటివ్ టాక్ రావడంతో టీం సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మేనల్లుడి ఫస్ట్ సినిమాకు మంచి టాక్ రావడంతో అశోక్‌తో సహా ‘హీరో’ యూనిట్ అందరకీ విషెస్ చెబుతూ మహేష్ ట్వీట్ చేశారు.

Congratulations team #HERO! Extremely happy to see the unanimous applause for the film! 👏👏👏— Mahesh Babu (@urstrulyMahesh) January 15, 2022

Exit mobile version