ఆకట్టుకుంటున్న “మంచి రోజులు వచ్చాయి” టీజర్

యూవి కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ఏక్ మినీ కథ ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ కి జోడీగా మెహ్రీన్ కౌర్ పీజ్రాదా నటిస్తుంది. ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ నిర్మించారు. మేకర్స్ విడుదల తేదీని అతి త్వరలో ప్రకటించనున్నారు. చిత్రబృందం థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. మారుతీ స్టైల్ సిట్యుయేషనల్ కామెడీ నవ్వులు పూయిస్తోంది.