మెగా ఫ్యామిలీ ఫై కలెక్షన్ కింగ్ చివాట్లు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరోసారి మెగా ఫ్యామిలీ ఫై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేసారు. మా ఎన్నికల్లో మా అధ్యక్షుడి గా విష్ణు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా శనివారం విష్ణు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు , తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ క్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘సినిమాలు హిట్, ప్లాఫ్ అవుతుంటాయి. కానీ మేము అంతమంది ఉన్నాం, ఇంత మంది ఉన్నాం అని బెదిరించినా అదరక బెదరక ఓటు వేసి విష్ణును గెలిపించిన మా సభ్యులకు కృతజ్ఞతలు. నాకు రాగ, ద్వేషాలు లేవు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతా? మంత్రి శ్రీనివాసయాదవ్ చెప్పినట్లు నా కోపం నాకు చెడు చేసింది అని అన్నారు. విష్ణు భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ‘మా’కి పేరు ప్రఖ్యాతులు తీసుకు రావాలి అని కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు.