Site icon TeluguMirchi.com

‘ముకుందా’ ఫస్ట్ లుక్ ఇదే

varun
నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ముకుంద’. పూజా హెగ్డే నాయిక. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాత. చిరంజీవి జన్మదినం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దర్శకుడు మాట్లాడుతూ ”కుటుంబ విలువలకు, సంప్రదాయాలకు పెద్ద పీట వేసిన కథ ఇది. ఈతరం కుర్రాళ్ల భావోద్వేగాలు, జీవితంపై వాళ్లకున్న స్పష్టత నేపథ్యంలో సినిమా ఉంటుంది” అన్నారు. ”చిత్రీకరణ చివరి దశకొచ్చింది. వచ్చే నెలలో పాటలను, అక్టోబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నహాలు చేస్తున్నారు.

Exit mobile version