‘నాటు నాటు’ మరో సంచలనం… ఆస్కార్ కు అడుగు దూరంలో


దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ బరిలో నిలిచింది. తాజాగా ది అకాడమీ ప్రకటించిన 95వ ఆస్కార్‌ నామినేషన్లలో ‘ నాటు నాటు ‘ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్నది. పలు భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్ లిస్ట్ కాగా.. అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ మెంబర్స్ తుది జాబితాకు ఎంపిక చేశారు.

అలాగే భారతీయ షార్ట్ ఫిల్మ్స్ ‘ఆల్ దట్ బ్రీత్స్’ కు డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో , ‘ది ఎలిఫెటంట్ విస్పరర్స్’ కు డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్స్ ద‌క్కాయి.