నాని కి పెనుప్రమాదం తప్పింది

నేచురల్ స్టార్ నాని పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం నాని ‘దసరా’ అనే సినిమాను చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ప్రస్తుతం గోదావరిఖని బొగ్గు గనుల్లో జరుగుతోన్న ‘దసరా’ మూవీ షూటింగ్‌లో నాని పాల్గొన్నాడు. కాగా ఈ షూటింగ్ లో నాని ప్రమాదానికి గురయ్యాడు. ఓ టిప్పర్‌లో ఉన్న బొగ్గు లోడ్ హీరో నాని మీద పడిందని తెలుస్తోంది. దీంతో వెంటనే పక్కన ఉన్న సిబ్బంది అతడిని బయటకు తీశారని సమాచారం. కాగా నానికి స్వల్ప గాయాలే అయినట్లు తెలుస్తోంది. కాసేపు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన నాని..ఆ తర్వాత షూటింగ్ లో పాల్గొన్నాడని సమాచారం. ఈ ఊహించని సంఘటనతో దసరా మూవీ యూనిట్ మొత్తం ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు తెలిసింది.