నెగిటివ్ రోల్ లో నాని..?

శ్యామ్ సింగ రాయ్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని..ప్రస్తుతం దసరా మూవీ చేస్తున్నాడు. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుంది. అయితే, ఈ సినిమాలో నాని నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

గతంలో ‘జెంటిల్ మేన్’, ‘వి’ చిత్రాల్లో నాని విలన్ తరహా పాత్రలో నటించి మెప్పించాడు. మరోసారి అలాంటి పాత్రలోనే నటిస్తున్నాడని అంటున్నారు. బొగ్గుగని బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న దసరా చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.