Eleven Trailer : నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఎలెవెన్’ అద్భుతమైన కథనంతో ప్రేక్షకుల అంచనాలను పెంచుతోంది. ‘వంద రాజవతాన్ వరువేన్’, ‘యాక్షన్’ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని AR ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు. తాజాగా కమల్ హాసన్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఓ భారీ అగ్నిప్రమాదంతో ప్రారంభమైన ట్రైలర్, వైజాగ్‌లో జరిగిన వరుస సీరియల్ కిల్లింగ్ కేసుల విచారణ నేపథ్యంలో నడుస్తుంది. “సైకో కిల్లర్ విత్ అన్‌బిలీవబుల్ ఐక్యూ” అంటూ సస్పెన్స్‌ను రెట్టింపు చేయగా.. నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, ‘వైజాగ్‌లో ఎనిమిది వరుస హత్యలు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌కు కొత్త ఉత్కంఠను ఇచ్చారు.
టెక్నికల్‌గా సినిమా అత్యుత్తమంగా ఉండేలా రూపొందించారు. కథానాయికగా రేయా హరి నటించగా.. అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డి. ఇమ్మాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, కార్తీక్ అశోకన్ సినిమాటోగ్రఫీ, శ్రీకాంత్ ఎన్.బి. ఎడిటింగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. రుచిర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తరఫున ఎన్. సుధాకర్ రెడ్డి థియేట్రికల్ రైట్స్‌ను పొందగా, మే 16న ఈ థ్రిల్లర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాల సమ్మేళనంగా ‘ఎలెవెన్’ ఈ వేసవిలో అద్భుతమైన సినిమా ఎక్స్ పీరియన్స్ ని అందించడానికి సిద్ధంగా ఉంది.