Site icon TeluguMirchi.com

నయన్ పై లవర్ పొగడ్తలు

శింబు, ప్రభుదేవాలతో ప్రేమయానం బెడిసికొట్టిన తర్వాత నయనతార మళ్ళీ ప్రేమలో పడిన సంగతి తెల్సిందే. దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో మునిగితేలుతోంది నయన్ . మొన్నటి వరకూ కాస్త గుట్టుగా వున్న ఈ జంట ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. తనకు కాబోయే భర్త విగ్నేశే‌ అని నయన్‌ ఓ అవార్డుల కార్యక్రమంలో పరోక్షంగా చెప్పింది నయన్.

కాగ తాజాగా నయన్ పై అభినందనల జల్లు కురుపించాడు విగ్నేశ్‌‌ శివాన్‌. నయన్‌ నటించిన సినిమా ‘కోలమావు కోకిల’. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకుడు. యోగిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ నెలలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు విగ్నేశ్‌ సాహిత్యం అందించారు.

ఈ నేపథ్యంలో ఆయన సినిమాలో నయన్‌ స్టిల్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘నయనతార నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. కొత్త కథలు, దర్శకులపైన నీకున్న నమ్మకం, తీసుకునే నిర్ణయం, తెరపై నీ ప్రదర్శన.. స్ఫూర్తిదాయకం. నీ ఎక్స్‌ప్రెషన్స్‌కు పాటలు రావడం సంతోషంగా ఉంది’ అని చెప్పాడు విగ్నేష్.

Exit mobile version