తెలుగులో మొదలెట్టిన హీరోయిన్ న‌జ్రియా

రాజా రాణి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన న‌జ్రియా ఈ రోజు నుండీ అంటే సుంద‌రానికీ మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది. హైద‌రాబాద్‌ లో జ‌రుగుతున్న ఈ షెడ్యూల్‌లో న‌జ్రియా స‌హా ఇతర కీల‌క తారాగ‌ణంపై స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ‌ఈ సంద‌ర్భంగా హీరోయిన్ న‌జ్రియా న‌జీమ్ `నా ఫ‌స్ట్ తెలుగు మూవీ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు నా తొలి తెలుగు సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టాను. ఫ‌స్ట్‌ చేసే పని ఏదైనా స్పెషల్‌గా ఉంటుంది. కాబట్టి ‘అంటే సుందరానికీ’ నాకు చాలా స్పెషల్‌” అని తన భావాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తోన్న 28వ చిత్రం `అంటే సుందరానికీ.’. ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్ న‌జ్రియా జతకట్టనుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, రవితేజ గిరిజ‌ల ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌.