Site icon TeluguMirchi.com

NBK109 : మహాశివరాత్రి సందర్భంగా NBK109 గ్లింప్స్ రిలీజ్ !


అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకొని మంచి జోష్ లో వున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో #NBK109 సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది.

Gama Awards : బెస్ట్ యాక్టర్ గా ‘బేబీ’ హీరో ఆనంద్ దేవరకొండ.. ఇదే ఫస్ట్ అవార్డ్

రేపు మహాశివరాత్రి సందర్భంగా NBK109 గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. “ఈ మహాశివరాత్రి నాడు హింసను స్వాగతిద్దాం” అంటూ పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Exit mobile version