నెట్ ఫ్లిక్స్ లో సినిమాల జాతర – 16 సినిమాలు …


అంతర్జాతీయ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్, తమ వేదికపై 2023 లో రాబోయే 16 తెలుగు సినిమాల పేర్లు సంక్రాంతి సందర్భంగా వెల్లడించారు. ఈ విధంగా థియేటర్లలోనే కాక, తమ అభిమాన హీరో చిత్రాన్ని ఇంట్లో కూడా చూస్తూ ఆనందించగలరు.

సంక్రాంతి పండుగ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ ఈ 16 తెలుగు సినిమాల పేర్లు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రకటించగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఆర్ఆర్ఆర్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి వంటి చిత్రాలకి నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభించగా ఈ సంవత్సరం విడుదలయ్యే చిత్రాలకి అంతకు మించి స్పందన రానుందని అర్ధమవుతుంది.

చిత్రాల పేర్లు ప్రకటిస్తున్న సందర్భంలో నెట్ ఫ్లిక్స్ కంటెంట్ వి.పి – మోనికా షెర్గిల్ మాట్లాడుతూ “మా ప్రేక్షకులకి నచ్చే ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కథలని ఆర్ఆర్ఆర్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి వంటి చిత్రాలని అందించాలనుకుంటున్నాము. భారీ అంచనాల మధ్య ఈ సంవత్సరంలో విడుదల అయిన తెలుగు చిత్రాలని త్వరలో మా నెట్ ఫ్లిక్స్ లో తీసుకురానుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాల ద్వారా సౌత్ ఇండియాలో పెరుగుతున్న టాలెంట్ ప్రపంచవ్యాప్తంగా తెలియనుంది. అందుకు తగ్గట్టుగా సంకేతింగా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాం” అన్నారు.

SSMB 28, Bhola Shankar, Dasara, Dhamaka, Tillu Square, Anushka-Naveen P film, Amigos, Meter, Buddy, Butta Bomma, PVT 04, Tillu Square, Kartikeya 8, 18 Pages, VT 12, Virupaksha