Site icon TeluguMirchi.com

ఇక ఫై నో ఆన్లైన్ మూవీ టికెట్స్..

ఇక ఫై ఆన్లైన్ మూవీ టికెట్స్ బుక్ చేసుకోలేరు..ఎందుకంటే ప్రభుత్వమే నేరుగా సినిమా టికెట్లను విక్రయించే యోచనలో ఉందట..ఈ విషయాన్నీ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

తాజాగా మీడియా తో మాట్లాడుతూ..సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే విధానానికి స్వస్తి చెప్పబోతున్నామని..ప్రభుత్వమే నేరుగా టికెట్లను విక్రయిస్తే అందరికీ లాభముంటుందని..అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఈ కొత్త విధానం వల్ల నిర్మాతలకు, పంపిణీదారులకు ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. మరి ఇది ఎప్పుడు అమలు చేస్తారు అనేది మాత్రం తెలుపలేదు.

Exit mobile version