Site icon TeluguMirchi.com

‘ఎన్టీఆర్ కెరీర్ హైయ్యస్ట్ గ్రాస్

ఎన్టీఆర్ కి మరో హిట్ పడిపోయింది. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. పూజాహెగ్డే కథానాయిక. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద హిట్ టాక్‌ను తెచ్చుకుంది.

యూనిట్ సక్సెస్ మీట్ కూడా పెట్టేసింది. ఈ మీట్ లో దిల్ రాజు మాట్లాడారు. ”ఎన్టీఆర్ కెరీర్ హైయ్యస్ట్ గ్రాస్ చేస్తున్న సినిమా ఇది. మాటల మాంత్రికుడు మాయ చేశాడు. ఇంద్ర యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రం. ఆది – సమర సింహారెడ్డి – నరసింహా నాయుడు .. ఇలా ఎన్నో ఫ్యాక్షన్ సినిమాలు చూశాం. ఫ్యాక్షన్ కథని త్రివిక్రమ్ అంత గొప్పగా చూపించారు. నటుడిగా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చూపించారు. సినీపరిశ్రమ వెయిటింగ్ లో ఉంది మంచి హిట్టు కావాలని. రెండు నెలలుగా మంచి సినిమా రాలేదు. ఒక మంచి సినిమా ఇచ్చినందుకు త్రివిక్రమ్ కు థాంక్స్ ” అన్నారు.

Exit mobile version