ఎన్టీఆర్ 30 : కొరటాల శివ తో మరోసారి ఎన్టీఆర్

ఉగాది సందర్భంగా ఎన్టీఆర్ 30వ చిత్రం ప్రకటన వెలుబడింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త చిత్రం ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మాణం జరుపుకోనుంది. సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే అప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. 2022 ఏప్రిల్ 29న ఈ చిత్రం విడుదలకానుంది.

గతంలో ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయింది. మరోసారి ఎన్టీఆర్ తో కలిసి పనిచేస్తుండడం పట్ల దర్శకుడు కొరటాల శివ హర్షం వ్యక్తం చేశాడు. చివరిసారి తాము చేసినవి లోకల్ రిపేర్లు అనీ, ఈసారి కాస్త మార్పు కోసం సరిహద్దులు దాటుతున్నామనీ కొరటాల వెల్లడించాడు. అటు, కొరటాలతో మళ్లీ పనిచెయ్యనుండడంపై ఎన్టీఆర్ కూడా స్పందించాడు. ‘మీతో మరో సినిమా చేయడం నాక్కూడా సంతోషదాయకమే’ అంటూ ట్వీట్ చేశాడు.