Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్ చేతికి యాపీ ఫిజ్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ పక్క వరుస సక్సెస్ లు అందుకుంటూ అభిమానులనే కాదు వాణిజ్య సంస్థలను సైతం ఆకర్షిస్తున్నాడు. దీంతో తమ బ్రాండ్ లకు ప్రచారం కోసం ఎన్టీఆర్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే బోరోప్లస్, నవరత్న ఆయిల్, మలబార్ గోల్డ్, సెలెక్ట్ మొబైల్స్ వంటి సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ కు మరో బ్రాండ్ చేతికి వచ్చింది.

పార్లే ఆగ్రో కంపెనీ తమ పాపులర్ ప్రోడక్ట్ యాపీ ఫిజ్ అడ్వర్టైజింగ్ కోసం ఎన్టీఆర్ ను సెలెక్ట్ చేసుకుంది. ఎన్టీఆర్ సౌత్ ఇండియా రీజియన్ మొత్తానికి ప్రచారకర్తగా ఉండబోతున్నాడు. ఇకపోతే ఉత్తరాదిలో ఈ ప్రొడక్టును బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యనే అరవింద సమేత తో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్..ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.

Exit mobile version