Site icon TeluguMirchi.com

మన తెలుగు పాట ఆస్కార్ బరిలో పోటీపడటం గర్వకారణం : పవన్ కళ్యాణ్


ఆర్.ఆర్.ఆర్. చిత్రంలోని ‘నాటు.. నాటు…’ గీతం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం ఆస్కార్ పురస్కారానికి నామినేట్ కావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మన తెలుగు పాట ఆస్కార్ కోసం తుది బరిలో పోటీపడటం అందరికీ గర్వ కారణం. అంతేకాదు ఇంతటి ప్రాచుర్యం పొందేలా గీతాన్ని స్వరపరచిన శ్రీ ఎమ్.ఎమ్.కీరవాణి గారికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ‘నాటు.. నాటు…’ గీతం ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. ఆస్కార్ బరిలో మన చిత్రం నిలిచేలా చేసిన దర్శకుడు శ్రీ రాజమౌళి, హీరోలు శ్రీ రాం చరణ్, శ్రీ ఎన్టీఆర్, నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్య, గీత రచయిత శ్రీ చంద్రబోస్, గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవ, ఇతర సాంకేతిక బృందానికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.

Exit mobile version