Site icon TeluguMirchi.com

కళ్యాణ్ బాబు.. సినిమాలు చేయకతప్పదు !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్… పవర్ స్టార్. సినిమా గ్లామర్ తోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు గ్లామరు, ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగే ప్రధాన బలం. అయితే రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. సినిమాలకు దూరం అయ్యారు. ఇక రాజకీయాలే చేస్తానన్నారు. అయితే ఆయనకీ మనసులో కేవలం రాజకీయాలే చేయాలనీ వున్నా.. పరిస్థితులు మాత్రం సహకరించడం లేదు. సినిమాలు ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి.

పవన్ కళ్యాణ్ దగ్గర ముగ్గురు నిర్మతల అడ్వానన్సులు వున్నాయి. ఇవి టోటల్ గా యాబైకోట్లకు పైనే. ఇప్పుడు ఆయన చేతి నుండి ఇంత డబ్బు వెనక్కి ఇచ్చే పరిస్థితి లేదు. అందులోనూ జనసేన పార్టీ నిర్వహణకు కూడా డబ్బు లేదు. ఈ బాద్యత కూడ పవన్ కళ్యాణ్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా డబ్బుతో ముడిపడిన వ్యవహారాలు.

పవన్ కళ్యాణ్ కి బిజినెస్ లు లేవు. ఉన్నదంతా ఆయనకి వున్న స్టార్ డమ్. అందుకే ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయాలనీ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే సినిమా వాళ్ళు రాజకీయాలకి వస్తే ఓ ఇబ్బంది వుంది. మళ్ళీ సినిమా చేస్తే.. ‘రాజకీయాలకు ప్యాకప్.. ఇంక మేకప్’ అని ఎద్దేవా చేయడనికి రెడీగా వుంటాయి విపక్షాలు. కానీ ఏం చేస్తాం..?! సినిమా అనేది బిజినెస్ కాదు.. ఎవరికీ తెలియకుండా గుట్టుగా చేయడానికి. విమర్శలని ఎదురుకొని ముందుకు వెళ్ళిపోవడమే.

Exit mobile version