పవన్ మూవీ సెట్ పిక్స్ హల్చల్

పవన్ కళ్యాణ్ – రానా ల కాంబినేషన్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా..త్రివిక్రమ్ మాటలు అందించడం విశేషం. మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ తాలూకా ఆన్ సెట్ పిక్స్ బయటకు వస్తూ హల్చల్ చేస్తున్నాయి.