Site icon TeluguMirchi.com

పాయల్ చెప్పిన అసలైన రహస్యాలు..వింటే అబ్బా అనాల్సిందే..

RX100 చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచయమైనా పాయల్ రాజ్ పుత్..మొదటి చిత్రంతోనే యూత్ కు బాగా దగ్గరయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఈ బ్యూటీ..తాజాగా RDX లవ్ అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు వెంకిమామ , రవితేజ తో డిస్కో రాజా చిత్రంలో నటిస్తుంది. ఇలా వరుస ఆఫర్లు రావడానికి కారణం అమ్మడి ఫిట్నెస్..ఆ ఫిట్నెస్ కు సంబందించిన రహస్యాలు బయటపెట్టింది.

ఉదయం లేచిన వెంటనే గ్రీన్ లేదా లెమన్ వాటర్ తీసుకుంటుందట. ఇవి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయని చెప్పుకొచ్చింది. ఆ తరువాత లైట్ గా
జిమ్ చేస్తుందట. అనంతరం పవర్ యోగా చేస్తుందట. మామూలు యోగా చేయడం కంటే పవర్ యోగా చేయడం వలన శరీరం మరింత శక్తివంతంగా మారుతుందని ఫిట్నెస్ గా ఉండేందుకు పవర్ యోగా సహకరిస్తోందని చెప్పుకొచ్చింది.

Exit mobile version