హాట్ బికినీతో రెచ్చిపోయిన పూజా హెగ్డే

అభిమానులను మరో బికినీ ట్రీట్ ఇచ్చింది పూజా హగ్దే . తెలుగు , హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పూజా హగ్దే..కాస్త తీరిక దొరికితే చాలు హాట్ హాట్ బికినీలతో రెచ్చిపోతుంది. తాజాగా ఈ బుట్టబొమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె మాల్దీవుల్లో బికినీతో ఫోజులిచ్చింది. దీంతో ఆమె అందాలు మొత్తం చూపరులకు తెగ కనువిందు చేసేస్తున్నాయి. ఫలితంగా ఈ హాట్ పిక్ క్షణాల్లో వైరల్‌గా మారిపోయాయి.

సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ షూటింగ్‌లను కూడా కంప్లీట్ చేసుకుంది. అలాగే, కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తోన్న ‘బీస్ట్’లోనూ హీరోయిన్‌గా చేస్తోంది. వీటితో పాటు హరీశ్ – పవన్ కలయికలో వచ్చే సినిమాతో పాటు త్రివిక్రమ్ – మహేశ్ కాంబోలో రానున్న ప్రాజెక్టులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.