పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ హరీష్ శంకర్ కాబినేషన్ లో (#PSPK28) భవదీయుడు భగత్ సింగ్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉండగా ఇంతవరకు పట్టాలెక్కలేదు. అయితే హరీష్ శంకర్‌కు ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడిందని సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం. ఇంతకీ ఆయన సినిమాకు వచ్చిన సమస్యేంటో తెలుసా!.. పూజా హెగ్డే. ఈ సినిమా ఇప్పుడప్పుడే సెట్స్ పైకి వెళ్లేలా కనిపించటం లేదు. మరో వైపు పూజా హెగ్డేకు వరుస అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఆమెకు డేట్స్ అడ్జస్ట్ చేయటంలో ఇబ్బందులు తలెత్తేలా ఉండటంతో సినిమా చేయలేనని హరీష్ శంకర్‌కు చెప్పేసిందని టాక్. దీంతో ఆయన మరో హీరోయిన్ను వెతుక్కునే పనిలో ఉన్నారని ఫిలిం వర్గాల సమాచారం.