Site icon TeluguMirchi.com

పాక్‌లో పూనమ్ కౌర్ పూజలు..

పూనమ్ కౌర్..ఈమె చేసిన సినిమాల కన్నా..సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన ట్వీట్స్ అమ్మడికి విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చాయి. ముఖ్యం గా పవన్ కళ్యాణ్ వ్యవహారం లో ఈమె పేరు పెట్టకుండా పవన్ అర్ధం వచ్చేలా చేసే కామెంట్స్ అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తుంటాయి. తాజాగా ఈ భామ పాక్ లో శివ పూజా చేసి వార్తల్లో నిలిచింది.

పాక్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న పురాతన ఆలయం శ్రీ కటస్ రాజ్ ఆలయంలో ఇటీవల పూనమ్ కౌర్ శివ పూజ చేశారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆలయంలో శివలింగానికి పూజలు చేస్తున్న ఫొటోలను కూడా ట్వీట్ చేశారు. ఈ ఆలయంలో పూజలు చేస్తానని కలలో కూడా అనుకోలేదని పూనమ్ చెప్పుకొచ్చింది.

Exit mobile version