ప్రభాస్ ను పోలీస్ గా చూపించబోతున్నాడా..?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. రాధే శ్యామ్ , ఆదిపురుష్ , సలార్ తో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ సెట్స్ ఫై ఉండగానే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ డైరెక్షన్లో పాన్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ మూవీ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతవరకూ ఒకటి రెండు సినిమాలలో పోలీసులకు సహకరించే పాత్రలను చేశాడుగానీ ఖాకి డ్రెస్ మాత్రం వేయలేదు. ఆ పాత్రలో తాను కనిపించాలనే అభిమానుల ముచ్చటను ప్రభాస్ ఈ సినిమాతో తీర్చనున్నాడని చెప్పుకుంటున్నారు. ప్రభాస్ మాటల్లో అర్థం అదేనని అంటున్నారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఈ పాత్రలో ఆయన అదరగొట్టేయనున్నాడని చెబుతున్నారు.