పుష్ప మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో..అంతకు రెట్టింపు విజయం అందులోని పాటలు సాధించాయి. ముఖ్యంగా ఊ అంటావా.. ఊఊ అంటావా అనే ఐటెం సాంగ్ శ్రోతలను , యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ లో సమంత ఘాటైన అందాలతో , డాన్స్ తో ఆకట్టుకుంది. దీంతో ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధిస్తూ వార్తల్లో నిలుస్తుంది.
ఇక ఈ సాంగ్ కు ప్రతి ఒక్కరు ఊ కొడుతూ..డాన్సులు వేస్తున్నారు. తాజాగా ప్రగతి ఆంటీ కూడా ఓ రేంజ్ లో చిందులేసి అదరగొట్టింది. తాజాగా ప్రగతి వేసిన స్టెప్పులు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. మామూలుగానే ప్రగతి మాస్ స్టెప్పులు వేస్తూ ఉంటుంది. జిమ్ ఏరియాలో వర్కవట్లు ఎలా చేస్తుంటుందో.. డ్యాన్సులు కూడా ఫుల్లుగా వేస్తుంటుంది. తాజాగా వర్కవుట్లు చేసిన అనంతరం ప్రగతి మాస్ స్టెప్పులు వేసింది. ఊ అంటావా? మావ అంటూ అందరినీ ఆకట్టుకుంది. View this post on Instagram