మూడు సినిమాలతో టాక్సీవాలా బ్యూటీ ఫుల్ బిజీ

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వెండితెరకు పరిచయమైన అనంతపురం కు చెందిన ప్రియాంకా జవాల్కర్.. టాక్సీవాలా సినిమాలో విజయదేవరకొండ పక్కన తళుక్కున మెరిసింది. మొదటి సినిమాతోనే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. అందం , అభినయం, నటన ఇవన్నీ అమ్మడిలో నిండుగా ఉండడం తో అమ్మడి క్రేజ్ బాగా వచ్చింది.

ప్రస్తుతం ఈ అమ్మడు ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను లైన్ లో పెట్టింది. ఇందులో మొదటిది ‘తిమ్మరుసు’ కాగా రెండోది ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. సత్యదేవ్ లాయర్ పాత్ర పోషించిన ‘తిమ్మరుసు’లో నాయికగా నటించింది ప్రియాంక జవాల్కర్. ఈ మూవీ ఈ నెల 30న విడుదల కాబోతోంది. కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన ఈ మూవీలో కాలేజీ స్టూడెంట్ గా ప్రియాంక జవాల్కర్ అందాలను బాగానే ఆరబోసిందని చెబుతున్నారు.