పూరి జగన్నాధ్ తో మరోసారి నితిన్ ?

డైరెక్టర్ పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ లైగర్ తెరకెక్కిస్తున్నాడు. నితిన్ ప్రస్తుతం బాలీవుడ్ హిట్ మూవీ అందదున్ తెలుగు రీమేక్ మాస్ట్రో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత యంగ్‌ హీరో నితిన్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘హార్ట్‌ ఎటాక్‌’ పర్వాలేదనిపించింది. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుండటం ఫిలిం నగర్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.