పుష్పక విమానం ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది…

విజయ్ దేవరకొండ సమర్పణలో ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం పుష్పక విమానం. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా శాన్వి మేఘ‌న‌, గీత సైనీ హీరోయిన్లుగా నటించారు. దామోద‌ర అనే నూత‌న ద‌ర్శ‌కుడు దర్శకత్వం వహించారు. నవంబర్ 12 న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫిస్ దగ్గర మిక్సడ్ టాక్ సంపాదించుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని ఓటిటి లో రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 10 నుండి ఆహా తెలుగు ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది.

పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయింది అంటూ గగ్గోలు పెట్టే భర్త కోణంలో ఒక ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆనంద్ దేవరకొండ ఈ చిత్రంలో చిట్టి లంక సుందర్ పాత్రలో నటించారు. సినిమా ప్రారంభంలోనే సుందర్ కి మీనాక్షి అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది. పెళ్ళైన మరుసటి రోజే మీనాక్షి కనపడకుండా పోతుంది. లేచిపోయిందనే విషయం సమాజానికి ఈ విషయం తెలియకుండా దాచి పెట్టేందుకు సుందర్ కష్టపడుతుంటాడు. అలా కీలకమైన ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కథ పెద్దగా ఏమీ ఉండదు కానీ భార్య మిస్సయ్యిందనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుందని, కానీ ఎక్కడా బోర్ కొట్టించకుండా ఫస్ట్ హాఫ్ ఉందని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో కథ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి మారుతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో సునీల్ ఎంట్రీ ఉంటుంది.