Site icon TeluguMirchi.com

‘రభస’ సెన్సార్ రిపోర్ట్

Rabasa-Sensor-reportఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘రభస’. సమంత, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంతోషం శ్రీనివాస్ దర్శకుడు. తాజాగా, రభస సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. సెన్సార్ బోర్డు రభసకు ‘ఎ’ సర్టిఫికెట్ ను జారీచేసింది. రక్తపాతంతో కూడిన భారీ ఫైట్స్ ను కట్ చేయడానికి.. చిత్ర యూనిట్ ససేమిరా అనడంతో.. రభస ‘ఎ’ సర్టిఫికెట్ సరిపెట్టుకోవాల్సి వచ్చినట్లు సమాచారమ్. దీనికి తోడు.. సమంత, ప్రణీతలు గ్లామర్ పరంగా పోటీపడి పోజులిచ్చినట్లు సెన్సార్ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు. యూత్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించేలా రభస వుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. వచ్చే శుక్రవారం ఆగస్టు 29న రభస ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం థమన్. నిర్మాత బొల్లంకొండ సురేష్.

Exit mobile version