రాధే శ్యామ్ నుండి భాగ్యశ్రీ లుక్ రిలీజ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ని గోపి కృష్ణ మూవీస్ , యూవీ క్రియేషన్స్ లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ లో అలనాటి హీరోయిన్ భాగ్య శ్రీ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ పాత్రకు సంబంధించిన లుక్‌ను సోషల్ మీడియా ద్వారా వదిలారు. ఇందులో ఆమె నటరాజస్వామి ఎదురుగా నాట్యం చేస్తూ కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా “ప్రపంచమే ఒక నాటక రంగం .. అందులో మనమంతా పాత్రధారులం .. ఎవరి పాత్రను వాళ్లు పోషించాలి” అంటూ భాగ్యశ్రీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.