రాధేశ్యామ్ నుండి ప్రభాస్ ఫోటో లీక్

ప్రభాస్ – రాధాకృష్ణ కలయికలో పూజా హగ్దే హీరోయిన్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్‌. కరోనా మహమ్మారి లేకపోతే ఈ సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వచ్చేది.కానీ చివరి నిమిషంలో కేసులు పెరగడం..పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూ మొదలుకావడంతో వాయిదాపడింది. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

ఈ సమయంలో ప్రభాస్ రాధేశ్యామ్ నుండి ఒక ఫొటో లీక్ అవ్వడంతో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. రాధేశ్యామ్ సినిమాలోని ఆ స్టిల్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. హ్యాండ్సమ్ గా స్టైలిష్ గా కూడా ప్రభాస్ కనిపిస్తున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.