ఎన్టీఆర్ షో జక్కన్న , కొరటాల

ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షో కు అగ్ర దర్శకులు రాజమౌళి , కొరటాల శివ లు హాజరయ్యారు. దీనికి సంబదించిన ఎపిసోడ్ సోమవారం నుండి ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను కూడా నిర్వాహకులు వదిలారు. ఈ ప్రోమో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

ఇక ఎన్టీఆర్ – రాజమౌళి కలయికలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చి విజయాలు సాధించగా..ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రాబోతుంది. అలాగే కొరటాల డైరెక్షన్లో ఎన్టీఆర్ తన 30 వ చిత్రం చేయబోతున్నారు. మరి ఈ క్రమంలో ఎన్టీఆర్ షో కు ఈ ఇద్దరు వస్తుండడం తో ఆ సినిమా తాలూకా ఏమైనా విషయాలు బయటకొస్తాయా అనేది ఆసక్తి గా మారింది.