పోర్న్ చిత్రాలను నుండి వచ్చిన డబ్బును రాజ్ కుంద్రా వాటికీ ఖర్చు చేసేవాడట

నగ్న వీడియో లతో వ్యాపారం తో పోలీసులకు అడ్డంగా దొరికిన న‌టి శిల్పాశెట్టి భ‌ర్త రాజ్‌కుంద్రా ను ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నెల 27 వరకు కస్టడీ లో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసుకు సంబదించిన వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.

ఈ మేరకు జుహులోని రాజ్ కుంద్రా నివాసానికి వెళ్లి శిల్పాశెట్టిని విచారించారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయడంతో పాటు కుంద్రా నివాసంలో ఏవైనా ఆధారాలు దొరుకుతాయా అనే కోణంలో సోదాలు చేసి ఓ లాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. 48 టీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉన్న ఈ లాప్‌టాప్‌లో 51 అశ్లీల చిత్రాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యాపారం ద్వారా రాజ్ కుంద్రా ప్రతీ నెలకు 10 వేల పౌండ్లను సంపాదించినట్టు విచారణలో తేలిందట. పోర్న్ చిత్రాల వ్యాపారం నుంచి గడించిన డబ్బును బెట్టింగ్‌కు ఉపయోగించినట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దృష్టికి వచ్చింది.