రామ్ 19 మూవీ టైటిల్ ఖరారు

ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రామ్..గత ఏడాది సంక్రాంతి బరిలో రెడ్ అంటూ వచ్చి ప్లాప్ అందుకున్నాడు. ప్రస్తుతం తన 19 వ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్ట్ చేస్తుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్6గా శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి టైటిల్ ను ఫిక్స్ చేసారు.

దీనికి ‘ది వారియర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖాయం చేస్తూ ట్విట్టర్ లో ప్రకటించారు మేకర్స్. ఇందులో రామ్ పోలీస్‌ఆఫీసర్ గా నటిస్తున్నాడు. తన కెరీర్‌లోనే మొట్టమొదటి సారిగా పోలీస్ యూనిఫామ్ తొడిగిన రామ్ కి ‘ది వారియర్’ చిత్రం ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.