Site icon TeluguMirchi.com

లిప్ లాక్ ల ఫై రామ్ మనసులోని మాట..

ఎనర్జిటిక్ హీరో రామ్ తాజాగా హలో గురు ప్రేమకోసమే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేను లోకల్ ఫేమ్ త్రినాధ్ నక్కిన డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణం లో వచ్చిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 18 న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.. దసరా సెలవులు కావడం తో చిత్ర ఓపెనింగ్స్ సైతం అదరగొట్టి , రామ్ కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.

చిత్ర ప్రమోషన్లలో భాగంగా పలు చానెల్స్ ఇచ్చిన ఇంటర్వ్యూ లలో రామ్ లిప్ లాక్ లపై స్పందించాడు. తాను ఇంతకు ముందు చేసిన సినిమాల్లో కొందరు లిప్ కిస్ పెట్టమని అడిగారని కాని స్క్రిప్ట్ డిమాండ్ చేయనప్పుడు అనవసరంగా ఎందుకు ఇరికించాలనే ఉద్దేశంతో నో చెప్పినట్టు తెలిపాడు. సబ్జెక్టు డిమాండ్ చేస్తే భవిష్యత్తులో చేస్తానేమో కాని ఇప్పుడు మాత్రం దాని ప్రసక్తే లేదంటున్నాడు.

Exit mobile version