రామ్ ‘ది వారియర్’ సెన్సార్ విశేషాలు


ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన రామ్… తాజాగా తమిళ దర్శకుడు లింగు స్వామీ డైరెక్షన్‌లో తన 19 వ మూవీ ‘ది వారియర్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కింది. ఈ చిత్రంలో రామ్ కి జోడీగా కృతిశెట్టి జతకట్టింది. ఈ చిత్రం జులై 14 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇటీవలే తమిళ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఆ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ సొంతంచేసుకుంది. కాగా ఈ సినిమా రన్ టైం 2 గంటల 35 నిమిషాల 7 సెకండ్లుగా ఉంది.