Site icon TeluguMirchi.com

45 మిలియన్ల వ్యూస్‌ తో దూసుకుపోతున్న రాములో రాములా..

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం అల..వైకుంఠపురం లో . సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవడం తో సినిమా తాలూకా ప్రమోషన్ కార్య క్రమాలు మొదలు పెట్టి సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ రాములో రాములా అనే సాంగ్ ను దీపావళి పర్వదినం సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో దుమ్ముదులిపేస్తుంది.

ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్‌ లో 45 మిలియన్ల వ్యూస్‌ తో దూసుకుపోతుంది. అలాగే టిక్‌ టాక్‌ లోనూ బాగానే ప్రభావం చూపిస్తోంది. శ్యాం కాసర్ల రాసిన ఈ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి మరియు మంగ్లీ పాడారు. తమన్ అద్భుతమైన ట్యూన్ తో ఈ పాటను తీర్చిదిద్దారు.

Exit mobile version