రాపో19 టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చేది ఆ రోజే …

ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన రామ్… తాజాగా తమిళ దర్శకుడు లింగు స్వామీ డైరెక్షన్‌లో తన 19 వ మూవీ ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రామ్ కి జోడీగా కృతిశెట్టి జతకట్టనుంది. ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ జనవరి 17 మధ్యాహ్నం 12 :07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ చిత్రం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, ఇందులో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని టాక్. ఈ చిత్రాన్ని దర్శకుడు లింగు స్వామీ విశాల్ పందెం కోడి చిత్రానికి దగ్గరగా ఉండేట్లు కథ రెడీ చేసుకున్నాడట. ఇదే కానీ నిజమైతే రామ్ ఎనర్జీ కి ఈ సినిమా మరొక లెవల్లో ఉంటుంది.