శివ కార్తికేయన్ సరసన రష్మిక..?

గీత గోవిందం చిత్రంతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక..ప్రస్తుతం తెలుగు , హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ రెండు చేతుల గట్టిగానే సంపాదిస్తుంది. తాజాగా ఈ భామ తమిళ్ ఛాన్స్ కొట్టినట్లు వినికిడి. సుల్తాన్ మూవీ తో తమిళం లో ఎంట్రీ ఇచ్చిన ఈమె..ఇక ఇప్పుడు తమిళ్ హీరో శివ కార్తికేయన్ సరసన నటించే ఛాన్స్ కొట్టినట్లు సమాచారం.

ఈ సినిమాకి ‘జాతి రత్నాలు’ ఫేం కె.వి.అనుదీప్ దర్శకత్వం వహించబోతుండగా.. తెలుగు, తమిళంలో తెరకెక్కనుందట. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించబోతున్నారు. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్టు సమాచారం.