రావణాసుర గా రవితేజ, మాస్ లుక్ లో అదుర్స్…

మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే రవితేజ హీరోగా నటిస్తున్న కిలాడి సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అదే విధంగా శరత్ మండవ డైరెక్షన్లో రామారావు ఆన్ డ్యూటీ అనే మరో సినిమాలో రవితేజ నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక రవితేజ హీరోగా నటిస్తున్న మరో సినిమా రావణాసుర. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. తాజాగా ఈ సినిమా నుండి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ మాస్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.