పవన్ మూవీ కి పనిచేయడం గొప్ప వరం ..

పవన్ కళ్యాణ్ – రానా ల కాంబినేషన్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా..త్రివిక్రమ్ మాటలు అందించడం విశేషం. మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సినిమా ఫోటోగ్రాఫర్ గా రవి కే చంద్రన్ పనిచేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో, ఈ చిత్రం కోసం పని చేయడం పై రవి కే చంద్రన్ స్పందిస్తూ, కీలక వ్యాఖ్యలు చేశారు. భీమ్లా నాయక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లతో పని చేయడం అద్భుత అవకాశం అని అన్నారు.పవన్ స్టైల్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ను డిఫెరెంట్ ఫ్రేమ్స్ లో చూపిస్తా అంటూ చెప్పుకొచ్చారు.