Site icon TeluguMirchi.com

పవన్ ఫ్యాన్స్ కు చురకలు అంటించిన రేణు..

పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత రేణు దేశాయ్ లో చాల మార్పులే కనిపిస్తున్నాయి. ముఖ్యం గా ఈమె రెండో వివాహం చేసుకోబోతుందనే వార్త బయటకొచ్చినప్పటినుండి అప్పటి వరకు ఎంతో అభిమానించిన పవన్ అభిమానులు ఆమెపై విరుచుకపడుతున్నారు. ఈమె ఏం చేసిన దానిని నెగిటివ్ గానే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే రేణు ను ఇబ్బంది పెడుతూ , ఆమెను ఆగ్రహానికి గురి చేస్తుంది.

ఈమధ్య రేణు తన మనసులోని భావాలను.. పద్యాలుగా కవితలుగా మార్చి ‘ఎ లవ్ – అన్ కండిషనల్’ అనే ఒక పుస్తకం రాసింది. ఈ బుక్ ను ప్రమోట్ చేస్తూ తెగ బిజీ బిజీ మారింది. పలు టీవీ చానెల్స్ లలో ఇంటర్వ్యూ లు ఇస్తూ బుక్ గురించి చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులకు చురకలు అంటించింది.

పవన్ అభిమానులు చాలామంది ఈ పుస్తకం పవన్ గురించేనా అని అడుగుతున్నారని.. కానీ ఈ పుస్తకం పవన్ గురించి కాదని క్లారిటీ ఇచ్చింది. ప్రతి విషయాన్నీ పవన్ కళ్యాణ్ తో లింక్ చేయవద్దని అభిమానులు కోరింది. “నాకంటూ ఒక జీవితం ఉంది..అవి నా ఆలోచనలు కానీ ఏ వ్యక్తి గురించి కాదు” అని “నేను గతాన్ని వదిలేసి ముందుకు వచ్చేశాను.. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు.” అంటూ పవన్ అభిమానులకు చురక అంటించింది.

త్వరలో రేణు రెండో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్మెంట్ పూర్తీ అయ్యింది. ఆ వరుడెవరు అనేది మాత్రం చాల రహస్యం గా ఉంచింది.

Exit mobile version