ఉక్రెయిన్‌ లో గుమ్మడికాయ కొట్టబోతున్న ఆర్ఆర్ఆర్ టీం

ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.కరోనా సెకెండ్‌ వేవ్‌ తర్వాత హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ప్రారంభించిన రాజమౌళి అండ్‌ కో ఇటీవల ఈ షూటింగ్‌ పూర్తి చేసింది. హీరోలిద్దరిపై కీలక సన్నివేశాలను రామ్‌చరణ్‌పై ఓ పాటను చిత్రీకరించారు. ఆగస్ట్‌ ఒకటో తేదీ నుంచి ఉక్రెయిన్‌లో చివరి షెడ్యూల్‌ మొదలుపెట్టబోతున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ అంత పూర్తి అవుతుంది. ఒకటో తేదిన ప్రధాన తారాగణం, దర్శకుడు అక్కడికి చేరుకుని రెండో తేదిన షూటింగ్‌ మొదలుపెడతారని సమాచారం. ఆగస్ట్‌ రెండోవారం వరకూ చిత్రీకరణ జరుగుతుందని సమాచారం.