Site icon TeluguMirchi.com

# RRR నో రిలీజ్..

రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలు గా భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుండే ఈ చిత్రం ఫై అంచనాలు పెరగడం మొదలు అయ్యాయి. ఈ సినిమా తాలూకా ఏ విషయం బయటకు వచ్చిన అది కషన్లో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు సినిమాకు సంబందించిన అనేక రకాల వార్తలు బయటకు రాగా..చిత్ర యూనిట్ నుండి అధికారిక పోస్టర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యం లో ఈ సినిమా తాలూకా పోస్టర్ ఆగస్టు 15 న విడుదల కాబోతుందనే వార్త వైరల్ అయ్యింది. ఇది చూసి చాలామంది నిజమే అని అనుకున్నారు.

కానీ ఆగస్ట్ 15న ఎలాంటి స్టిల్ రిలీజ్ చేయడం లేదని స్వయంగా రాజమౌళి ప్రకటించాడు. దీంతో అయ్యో అని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే ..ఈ సినిమాలో కొమరం భీమ్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. స్వతంత్ర ఉద్యమంనాటి కథ ఇది . దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Exit mobile version