RRR స్పెషల్ సాంగ్ లో టాప్ నటి నటులు కనిపించబోతున్నారా..?

ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రను ఎన్టీఆర్ , పోషిస్తుండగా..అల్లూరి సీతారాం పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ తరుణంలో ఈ చిత్రంలోని ప్రమోషన్ సాంగ్ విశేషాలు బయటకొస్తూ సినిమా ఫై అంచనాలు పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ సాంగ్ లో అనిరుద్ అదిరిపోయే స్టెప్స్ తో కనిపిస్తున్నాడనే వార్త బయటకు రాగ .. ఈ సాంగ్ లో అగ్ర తారాగణంతో పాటుగా ఇంకొంత మంది సినీ ప్రముఖులు కూడా ఉండనున్నట్టుగా సినీ వర్గాలు చెబుతాయి. ఇప్పటికే స్టార్ హీరోలు ప్రభాస్ మరియు రానా ల పేర్లు కూడా వినిపించాయి. మరి ఈ సాంగ్ లో ఎలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో చూడాలి.